ఘనంగా ధన మైసమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : శ్రీ మెట్లబావి ధన మైసమ్మ తృతీయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఓంకారేశ్వర్ అయ్యగారి ఆధ్వర్యంలో, ధన మైసమ్మ దేవాలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం యాగప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, క్షేత్రపాలక ఆరాధన, సర్వతోభద్ర మండల పూజలు నిర్వహించారు. సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న, సంధ్యారాణి, ప్రధాన గౌరవాధ్యక్షులు కందకట్ల భాస్కర్, పెద్దూరు పెద్దయ్య, టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, అర్చకులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ మెట్లబావి ధన మైసమ్మ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.