10 :00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..
10 :00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..
♦️ సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై యూఏపీఏ కేసులో ఎన్ఐఏ హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మావోయిస్టు నేత కథా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో చేసిన ప్రసంగం ద్వారా మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించారని ఆరోపించింది. గత ఏడాది డిసెంబరులో అరెస్టైన ఇన్నయ్య ఇటీవల మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.
——————————————
♦️ హైదరాబాద్‌లో వనమహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను ఇబ్బందిపెట్టడం హైడ్రా లక్ష్యం కాదని, ప్రభుత్వ, దేవాదాయ భూములను ఆక్రమించిన వారిపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. భూ కబ్జాలు అరికట్టడం, పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.
——————————————
♦️ వనమహోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఎల్బీనగర్ ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీ, ప్రజల మద్దతే తనను సీఎం స్థాయికి తీసుకువచ్చిందని తెలిపారు.
——————————————
♦️ పారిస్‌లోని వివాటెక్-2026 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, స్వామిత్వ పథకం ద్వారా 3.1 కోట్లకు పైగా ఆస్తి కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. డ్రోన్లు, మ్యాపింగ్ సాంకేతికతతో గ్రామీణ కుటుంబాలకు ఆస్తి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు.
——————————————
♦️ వివాటెక్-2026లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఏఐ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, ‘ఆల్ ఇన్‌క్లూజివ్’ అని వ్యాఖ్యానించారు. సాంకేతికత అందరికీ చేరి అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని చెప్పారు.
——————————————
♦️ పారిస్‌లో జరిగిన వివాటెక్-2026లో ప్రధాని మోదీ భారత్ డిజిటల్ విప్లవం, యూపీఐ, డిజిలాకర్, స్టార్టప్‌ల విజయాలను ప్రపంచానికి వివరించారు. సాంకేతికత ఆధారంగా భారత్ వేగంగా రూపాంతరం చెందుతోందని చెప్పారు.
——————————————
♦️ భారత బ్యాడ్మింటన్ సంఘం (BAI) దేశంలో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహణకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. లీగ్ ద్వారా బ్యాడ్మింటన్‌కు మరింత వాణిజ్య గుర్తింపు, యువ క్రీడాకారులకు అవకాశాలు లభించనున్నాయి.
——————————————
♦️ వివాటెక్-2026లో భారత్‌కు ‘ఏఐ కంట్రీ పార్ట్‌నర్’ హోదా లభించింది. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి భారత స్టార్టప్‌లు, ఆవిష్కరణలను పరిశీలించారు.
——————————————
♦️ మెదక్ జిల్లా టేక్మాల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎన్‌ఆర్‌ఐ వివాహాలు జరిపిస్తానని నమ్మించి ముగ్గురు యువతుల నుంచి రూ.12 లక్షలు, తులం బంగారం కాజేసిన ఉప్పరి దుర్గేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో పోలీస్ స్టేషన్‌లోనే రాజీ జరిగిందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
