Solar | గిడ్డంగిని కబళించిన మంటలు..
Solar | గిడ్డంగిని కబళించిన మంటలు..
సోలార్ ప్యానెల్స్‌తో మరింత ఉధృతమైన అగ్ని
Solar | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాయిల్ హైట్స్ ప్రాంతంలోని ఓ భారీ గిడ్డంగిలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి తీవ్ర కలకలం రేపాయి.
గిడ్డంగి పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ కారణంగా మంటలు మరింత ఉధృతమయ్యాయని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదం కారణంగా ఎగిసిపడిన దట్టమైన నల్లటి పొగలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఈ దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
