Threepeople | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
Threepeople | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ (Medchal) జిల్లాలో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి–మురహరిపల్లి (Turkapally–Muraharipalli) మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
