దగ్ధమైన దుకాణం.. కారణం ఇదే..
నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో రాత్రి ఒంటి గంటకు శివరామ క్లాత్ స్టోర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి షాపు మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాప్ యజమాని బొప్పరాతి రాజు తెలిపారు. షాప్ లో ఉన్న బట్టలు మొత్తం కాలిపోవడంతో తీవ్ర నష్టం ఏర్పడిందని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

