రేపు మండల కేంద్రానికి కలెక్టర్ రాక
రేపు మండల కేంద్రానికి కలెక్టర్ రాక
వెల్దండ,ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ గురువారం సందర్శించనున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వెల్దండ మండల కేంద్రానికి 7 గంటల ప్రాంతంలో కలెక్టర్ విచ్చేయుచున్న సందర్భంగా గ్రామ మండల స్థాయి అధికారులు 6:30 గంటలలోపే మండల కేంద్రాన్ని చేరుకోవాలని తెలిపారు.
గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సెలవులు అనుమతించబడదని తెలుపుతూ గ్రామంలోని సర్పంచులు మీ మీ గ్రామాన్ని శుభ్రపరుచుకొని గ్రామపంచాయతీలోనే ఉండాలనిఉండాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధిహామీ పనులు, పారిశుధ్యం నిర్వహణ, సెగ్రిగేషన్ షేడ్స్ నిర్వహణ, నర్సరీల నిర్వహణ వంటి రిజిస్టర్ రికార్డులను సరి చూసుకోవాలని సూచించారు.
