Mothkur బుజిలాపురం చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
Mothkur బుజిలాపురం చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
చౌటుప్పల్ డీఎస్పీ ఆధ్వర్యంలో మోత్కూరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు కలిసి ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 8న మున్సిపల్ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మలిపెద్ది పద్మ–వెంకట్ రెడ్డి దంపతుల ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆనాజీపురం ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో నిందితులు పట్టుబడ్డారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
తొర్రూరు మండలం తులస్య తండాకు చెందిన బానోత్ నవీన్, సోమారపు కుంట తండాకు చెందిన దరావత్ దేవాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులను రామన్నపేట కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
