delhi | 9 మంది అరెస్ట్‌

delhi | 9 మంది అరెస్ట్‌

delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు హరియాణాలో భారీ ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ-సోనిపట్‌ హైవేపై ఉన్న పాపులర్ డాబా, హరియాణాలోని మిలిటరీ క్యాంప్‌, ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది.

షహజాద్‌ భట్‌ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న ఆపరేటివ్‌ల ద్వారా ఈ దాడులను అమలు చేయాలని ఐఎస్‌ఐ ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ అధికారులు వారిని విచారించగా కీలక వివరాలు బయటపడ్డాయి.

నిందితుల్లో ఒకరు ఢిల్లీలోని ప్రముఖ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించి అక్కడి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయం వద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కుట్ర వెలుగులోకి రావడంతో ఢిల్లీ, హరియాణా ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుల నెట్‌వర్క్‌, విదేశీ లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది.