Elkathurthy పెంచికలపేట గ్రామ ఉపసర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు..
Elkathurthy పెంచికలపేట గ్రామ ఉపసర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు..
కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి
ఎల్కతుర్తి (Elkathurthy), ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పెంచికలపేట గ్రామ ఉపసర్పంచ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.
మర్రి అశోక్ కోతుల నడుమ ఐకెపి సెంటర్ నుంచి సుమారు 500 గన్ని సంచులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. సీడ్ ఆర్గనైజర్‌గా ఉండటంతో తన సీడ్ కంపెనీ వడ్లను నింపుకోవడానికి ఆ సంచులను వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.
దీంతో ఐకెపిలో రైతులకు గన్ని సంచులు అందక, ఎమ్మార్పీ ధర కాకుండా మిల్లర్లు నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
ఉపసర్పంచ్‌ను పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మధుకర్ రెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
