సైకిల్‌పై కలెక్టర్, జేసీ.. అధికారులకు ఆదర్శం!
సైకిల్‌పై కలెక్టర్, జేసీ.. అధికారులకు ఆదర్శం!
పర్యావరణ పరిరక్షణకు సందేశం.. ప్రజా ఫిర్యాదుల వేదికకు ద్విచక్ర యానం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, శారీరక దారుఢ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ మరోసారి సైకిల్‌పై ప్రయాణించి అధికారులకు ఆదర్శంగా నిలిచారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమానికి ఇద్దరు అధికారులు సైకిళ్లపై హాజరయ్యారు. తమ క్యాంపు కార్యాలయాల నుంచి నేరుగా సైకిళ్లపై జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి తమ తమ క్యాంపు కార్యాలయాలకు కూడా సైకిళ్లపైనే ప్రయాణమయ్యారు.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే ఈ చర్య వెనుక ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు వరుసగా రెండో వారమూ సైకిల్‌పై ప్రజా ఫిర్యాదుల వేదికకు రావడం విశేషంగా నిలిచింది. గత వారం కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సైకిళ్లపైనే జడ్పీకి చేరుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
