భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి
మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం ప్రజా భవన్లో భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి, శాలువాతో సత్కరించి పూల బొకే అందజేసి శుభాభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజా సేవలో మరింత శక్తి, సామర్థ్యాలతో ముందుకు సాగాలని భగవంతుడు ఆశీర్వదించాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
