Vijayawada ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో 63 సీట్లు

Vijayawada ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో 63 సీట్లు

  • విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అభినందనలు

విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ:

ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో సత్తా చాటారు. 2026 మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన వారిలో 63 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

జిల్లాలో జీడీఈటీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల, పడమట నుండి అత్యధికంగా 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మైలవరం జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి 5 మంది విద్యార్థులు, ఏకేటీపీ మున్సిపల్ హై స్కూల్, సత్యనారాయణపురం నుండి 5 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలలో సీట్లు సాధించారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యారంగంలో ప్రతిభ చూపుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో 63 సీట్లు

Leave a Reply