ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

  • ప్రత్తిపాటి శ్రీధర్

ఆంధ్రప్రభ, విజయవాడ:

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, టీడీపీ పశ్చిమ బీసీ సెల్ అధ్యక్షులు ముదిరాజ్ శివాజీ, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పిళ్ళ శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, 54 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తారిక్ అజీజ్, తెలుగు యువత నాయకులు దాడి మురళి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ప్రజాదర్బార్ లో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బుధవారం నుంచి ఎన్డీఏ కార్యాలయంలో ప్రారంభమైన ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగుతుందని పశ్చిమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కోరారు. కార్యక్రమంలో ట్యాప్ ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాస్, టీడీపీ నేతలు ముజఫర్ బేగ్ , ఎస్ డి అలీ, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..

Leave a Reply