టీటీడీకి రూ.31.72 లక్షల విలువైన ట్రక్కు విరాళం
టీటీడీకి రూ.31.72 లక్షల విలువైన ట్రక్కు విరాళం
ప్రముఖ వాహన తయారీ సంస్థ నుంచి శ్రీవారి సేవలకు మరో కానుక
తిరుమల, ఆంధ్రప్రభ : ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.
