Nepal Accident | 24 మందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం
Nepal Accident | 24 మందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం
Nepal Accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: నేపాల్లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 24 మంది ప్రయాణికులతో కొండ ప్రాంత రహదారిపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
సమాచారం ప్రకారం, బస్సు దాదాపు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తీవ్రతకు ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో 16 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
