రేణిగుంట విమానశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్
రేణిగుంట విమానశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్‌కు ఘన స్వాగతం
విజయోత్సవ సభలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్
జనసేన, కూటమి కార్యకర్తల నినాదాలతో విమానాశ్రయం వద్ద సందడి
రేణిగుంట, జూన్ 12: తిరుపతిలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది.
జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో జనసేన, కూటమి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నినాదాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
