ESCAPE | నిందితుడి కోసం ముమ్మర గాలింపు

ESCAPE | నిందితుడి కోసం ముమ్మర గాలింపు

ESCAPE | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రాజ్‌కుమార్ కడప సెంట్రల్ జైలు నుంచి పరారైన ఘటన కలకలం రేపింది.

అనారోగ్య సమస్యల కారణంగా రాజ్‌కుమార్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో విశాఖపట్నంలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి కడప సెంట్రల్ జైలుకు తీసుకువస్తుండగా, గూడూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం.

ఖైదీ పరారైన విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి పరారవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.