Jailer 2 Hrithik Cameo I రజనీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్!

Jailer 2 Hrithik Cameo I రజనీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్!

Jailer 2 Hrithik Cameo I మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తర్వాత.. జైలర్‌ 2లో మరో స్టార్ క్యామియో?

Jailer 2 Hrithik Cameo I ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్:
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న జైలర్‌ 2 మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తొలి భాగం జైలర్ రజనీకాంత్ ప్రజెన్స్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్ క్యామియోలతో థియేటర్లను దద్దరిల్లించింది. దీంతో రెండో భాగంలో కూడా భారీ క్యామియో రోల్స్‌ ఉండబోతున్నట్లు సోషల్‌ మీడియాలో రోజుకొక వార్త హల్‌చల్‌ చేస్తోంది.

Jailer 2 Hrithik Cameo I తాజా సమాచారం ప్రకారం, జైలర్‌ 2లో బాలీవుడ్ బడా హీరో క్యామియో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్ కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఓ పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో కీలక సమయంలో వచ్చే హై-ఇంపాక్ట్ సీక్వెన్స్‌గా ఈ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Jailer 2 Hrithik Cameo

Jailer 2 Hrithik Cameo I 40 ఏళ్ల తర్వాత రజినీతో హృతిక్?

Jailer 2 Hrithik CameoI ఈ క్రేజీ అప్‌డేట్‌లో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రజనీకాంత్‌, హృతిక్ రోషన్ ఆన్‌స్క్రీన్ కనెక్షన్‌కు దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1986లో విడుదలైన భగవాన్ దాదా సినిమాలో బాలనటుడిగా హృతిక్ రోషన్, రజనీకాంత్‌తో కలిసి కనిపించాడు. ఇప్పుడు జైలర్‌ 2లో హృతిక్ క్యామియో నిజమైతే, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరి రీయూనియన్‌గా నిలవనుంది.

Jailer 2 Hrithik Cameo I జైలర్ తొలి భాగం దక్షిణాదితో పాటు హిందీలోనూ మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇప్పుడు హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఉంటే, జైలర్‌ 2 పాన్‌ ఇండియా రీచ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ మాస్ స్టైల్‌, నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్‌, అనిరుధ్ సంగీతానికి హృతిక్ ఎంట్రీ కూడా తోడైతే, థియేటర్లలో అభిమానులకు అది ఓ ప్రత్యేక మూమెంట్‌గా మారే అవకాశముంది.

click here for read more: Sing Geetham | రిలీజ్‌కు ముందే పెరిగిన క్రేజ్!

Leave a Reply