87days | విద్యా క్యాలెండర్ విడుదల
87days | విద్యా క్యాలెండర్ విడుదల
87days | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.
విద్యాశాఖ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉండనున్నాయి. అలాగే 87 రోజుల సెలవులను కూడా ప్రకటించారు. విద్యా బోధన, పరీక్షలు, సెలవులు, ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను క్యాలెండర్లో పొందుపరిచారు.
వార్షిక పరీక్షలు, ఇతర మూల్యాంకన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ క్యాలెండర్ను అనుసరించి విద్యా కార్యక్రమాలను కొనసాగించనున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
