Judgments | హైకోర్టులకు కొత్త మార్గదర్శకాలు జారీ

Judgments | హైకోర్టులకు కొత్త మార్గదర్శకాలు జారీ
Judgments | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తీర్పులు వెలువడటంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పుల విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
తీర్పును ప్రకటించిన తర్వాత పూర్తి కారణాలతో కూడిన ఉత్తర్వులను సాధారణంగా 7 రోజుల్లోపు అప్‌లోడ్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు గరిష్ఠంగా 15 రోజుల్లోపు తీర్పు కాపీని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
కోర్టులో తీర్పు ప్రకటించిన 24 గంటల్లోపు దానిని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించింది. అలాగే, రిజర్వ్ చేసిన కేసులో మూడు నెలల పాటు తీర్పు వెలువడకపోతే ఆ అంశం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. న్యాయ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
