TGBIE | తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజ‌ల్ట్స్ రిలీజ్

TGBIE | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలతో పాటు మార్కుల మెమోలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన వివరాల ప్రకారం, మే 13 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 889 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 3,98,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన బోర్డు, రాష్ట్రంలోని 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సమాధాన పత్రాలను పరిశీలించి ఫలితాలను సిద్ధం చేసింది.

ఫలితాలు చూసే వెబ్‌సైట్లు
tgbie.cgg.gov.in
results.cgg.gov.in

Leave a Reply