Sing Geetham | రిలీజ్‌కు ముందే పెరిగిన క్రేజ్!

Sing Geetham | రిలీజ్‌కు ముందే పెరిగిన క్రేజ్!

Sing Geetham | చిరంజీవి, వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ ప్రశంసలు.. ‘సింగ్ గీతం’పై పెరిగిన క్రేజ్‌

Sing Geetham | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో కూడా ఈ తారానికి నచ్చేలా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు కాదా అందుకే.. ఆయన టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ అయ్యాడు. అప్పటి తరంలోనే టాలీవుడ్ కానీ వినీ ఎరుగని విధంగా మాటాలు లేకుండా సినిమా, టైమ్‌ ట్రవెల్‌ మూవీస్‌ తో తను తీసి.. వారెవ్వా అనిపించారు. ఇప్పుడు జెన్‌ జెడ్‌ మెప్పెంచేందుకు సిద్ధమయ్యారు.

Sing Geetham లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ సినిమాపై రిలీజ్‌కు ముందే ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. జూన్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ముఖ్యంగా స్టార్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ సినిమాకు తొలి టికెట్ కొనడం సామాజిక మధ్యమంలో వైరల్‌గా మారింది. మెగా స్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ వంటి ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావుకి అభినందనలు తెలుపుతూ.. ట్వీట్స్‌ చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

Sing Geetham

Sing Geetham ఇక ఈ సినిమాకు ఇండస్ట్రీ నుంచి కూడా వరుసగా మద్దతు లభిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు వంటి గొప్ప దర్శకుడు ఈ వయసులోనూ కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడం సినీ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతుండటంతో ‘సింగ్ గీతం’ పేరు మరింత వైరల్ అవుతోంది.

Sing Geetham సినిమా విడుదలకు ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ రావడం మూవీ టీమ్‌కు మంచి బూస్ట్‌గా మారింది. సింగీతం శ్రీనివాసరావు మార్క్ కథనం, నాగ్ అశ్విన్ సపోర్ట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. జూన్ 12న విడుదల కానున్న ‘సింగ్ గీతం’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

click here for read more: Tollywood analysis I పాన్‌ ఇండియా సినిమాలు.. హీరోయిన్లకు వరమా? శాపమా?

Leave a Reply