Triangularseries | అఫ్గానిస్థాన్-ఏ బౌలర్లకు చుక్కలు!
Triangularseries | అఫ్గానిస్థాన్-ఏ బౌలర్లకు చుక్కలు!
Triangularseries | 22 బంతుల్లో 44 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్
భారత్-ఏకు శుభారంభం..
తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం
Triangularseries | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్లో మరో యువ సంచలనం తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అతడు బౌండరీల వర్షం కురిపిస్తూ భారత్-ఏకు అద్భుతమైన స్టార్ట్ అందించాడు.
హాఫ్ సెంచరీకి చేరువలోనే ఔటైనా, తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ముద్ర వేశాడు. మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ, ఈ మ్యాచ్‌లో తన సహజ శైలిలో ఆడుతూ మరోసారి భారత క్రికెట్లో తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి దూకుడు బ్యాటింగ్ యువ ఆటగాడిపై అంచనాలను మరింత పెంచింది.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏకు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభం అందించాడు. తొలి నుంచే దూకుడు ప్రదర్శించిన అతడు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 22 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు హాఫ్ సెంచరీకి చేరువలోనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే క్రీజులో ఉన్నంతసేపు అఫ్గానిస్థాన్-ఏ బౌలర్లపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించాడు.
వైభవ్ ధాటికి భారత్-ఏ స్కోరు కేవలం ఏడు ఓవర్లలోనే 74 పరుగులకు చేరుకుంది. తొలి వికెట్‌కు వైభవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. మరోవైపు ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, తర్వాత వేగం పెంచి 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు 84 పరుగుల వద్ద ఔటయ్యాడు.
అతని ఇన్నింగ్స్ భారత్-ఏను మరింత పటిష్ట స్థితిలో నిలిపింది. వైభవ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రయాన్ష్ ఆర్య సిక్సర్‌తో తన ఖాతా తెరిచి దూకుడు చూపించాడు. అయితే ఎక్కువసేపు నిలవలేక క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే బాధ్యత తీసుకోగా, మరో ఎండ్‌లో తిలక్ వర్మ జట్టుకు అండగా నిలిచాడు.
