Telangana tenant farmers 36 percent survey report| తెలంగాణలో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి

Telangana tenant farmers 36 percent survey report| తెలంగాణలో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి

Telangana tenant farmers 36 percent survey report| కౌలు రైతుల గుర్తింపుపై ప్రభుత్వ వైఫల్యం

సబ్సిడీలు, రాయితీలు అందని కౌలు రైతులు

భారీగా పెరుగుతున్న కౌలు ధరలు, నష్టాల్లో రైతులు


Telangana tenant farmers 36 percent survey report| హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే రైతుల సంఖ్య రోజు రోజు కూ పెరుగుతోంది. వీరిలో అత్యధికశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఈ మేరకు కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ చేసిన తాజా సర్వేలో ష్ట్రరైతాంగంలో 36శాతం మంది కౌలు రైతులే ఉన్నట్లు తేలింది. పెద్ద సంఖ్యలో కౌలు రైతులున్నా వారిని గుర్తించేందుకు ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని సర్వేలో తేలింది. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ఉన్నా అమలు చేయకపోవడంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వ పెట్టుబడి సాయం, కొనుగోళ్లు అన్నీ పట్టా పత్రాలతోనే ముడిపడి ఉండడంతో కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని కమిటీ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు 22 జిల్లాల్లో 47 మండలాలకు చెందిన 57 గ్రామాల్లో 1816 మంది కౌలు రైతులను ముఖాముఖి ద్వారా సర్వేను నిర్వహించింది.

సర్వే అధ్యయనం మేరకు కౌలు రైతుల్లో ఓసీలు తక్కువ. ఇటీవల కాలంలో కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గరిష్టంగా ఎకరాకు రూ. 53వేలకు చేరింది. రైతు భరోసా ఇస్తున్నా భూ యజమానులు కౌలును తగ్గించడం లేదు. ప్రస్తుతం 6.7 ఎకరాల కౌలు కమతం ప్రామాణికంగా ఉంది. ఇందులో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్న రైతులు 31శాతం మంది ఉండగా, ప్రస్తుతం అది 42 శాతానికి పెరిగింది. ఎకరాకు నికర ఆదాయం తగ్గిపోతుండడంతో చిన్న కౌలు రైతులు పెద్ద విస్తీర్ణంలో భూమిని కౌలుకు తీసుకుని సాగు గిట్టుబాటు కాక ఆర్థికంగా నష్టపోతున్నారు.

యూరియా సబ్సీడీకి 22.8శాతం, పత్తి కొనుగోళ్లకు 6.8శాతం, వరి ధాన్యం కొనుగోలుకు 20శాతం, సన్నాల కొనుగోళ్లకు 24శాతం, పంట నష్టపరిహారం పొందేందుకు 11శాతం రైతులు అర్హులుగా ఉన్నా ఇవేవీ వారికి అందడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయిదు ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు మద్దతు ధరతో పోలిస్తే పంట అమ్మినపుడు పత్తి అయిదు ఎకరాల దిగుబడిపై రూ.64వేలు, వరి రూ.40,350, మొక్కజొన్న రూ.87,800, సోయాబిన్ రూ.53,120 మేర నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గుర్తింపు కార్డుల ఆధారంగా రైతు సంక్షేమ పథకాలను కౌలు రైతులకు వర్తింప చేయాలని అధ్యయనం ప్రభుత్వానికి సూచించింది.


Leave a Reply