కాకి రంగరాజుకు అభినందనలు…

వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కాకి రంగరాజును మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కుమార్ అభినందించారు.

శనివారం కాకి రంగరాజును కలిసి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాకి రంగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని చిగులపల్లి రమేష్ కుమార్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కాకి రంగరాజు ప్రజాసేవలో మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply