పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రమాదేవి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమపై ఉంచిన ఆశలను నెరవేర్చాలని సూచించారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
