అమ్మ పేరిట మొక్క నాటండి.. ఎంపీ రఘునందన్ పిలుపు

అమ్మ పేరిట మొక్క నాటండి.. ఎంపీ రఘునందన్ పిలుపు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట మొక్క నాటి, దాన్ని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.

శుక్రవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నూతన కార్యాలయంలో మొక్కలు నాటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు.

పర్యావరణ సమతుల్యత కోసం త్వరలోనే మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జూన్ 10 నాటికి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రఘునందన్‌రావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈర్ల రంజిత్‌రెడ్డి, సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్‌గౌడ్, కార్యదర్శి కల్కి నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, పబ్బా సత్యనారాయణ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాయిని ప్రసాద్, సర్పంచ్ బెండవీణ, కౌన్సిలర్ అఖిల భరత్, మండల అధ్యక్షులు సంతోష్‌చారి, శ్రీనివాస్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.