Tollywood | బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమైన ఇద్దరు స్టార్స్!
Tollywood | బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమైన ఇద్దరు స్టార్స్!
Tollywood | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలోకి దింపేందుకు సిద్ధం చేయనునున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినా షూటింగ్ ఇక మొదలు కాలేదు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్టేడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

జూన్ 18న ప్రారంభం.. 22 నుంచి షూటింగ్!
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమాలు జూన్ 18న అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ వెంటనే, జూన్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వెంకటేష్‌తో అనిల్ రావిపూడికి ఇది ఐదవ ప్రాజెక్ట్ (F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ వంటి విజయాల తర్వాత). అలాగే, అనిల్ రావిపూడికి ‘పటాస్’ రూపంలో తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌తో మళ్ళీ కలిసి పనిచేయడం ఈ సినిమాకు అదనపు ఎమోషనల్ అట్రాక్షన్.
మళ్లీ సంక్రాంతికి..
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి విజయాలతో పండుగ సీజన్‌ను తన అడ్డాగా మార్చుకున్న అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నారు. అనిల్ రావిపూడి మార్కు కామెడీ, ఎమోషన్స్ , ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు, ముఖ్యంగా హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల జాబితాను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
