రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
లింబా కేలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ గీత మహేందర్
కుంటాల, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్పంచ్ సుంకారి గీత మహేందర్ అన్నారు. మంగళవారం కుంటాల మండలంలోని లింబా కే గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీత మహేందర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు.
దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని తెలిపారు. దీని ద్వారా రైతులకు న్యాయమైన ధర లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సర్పంచ్ గీత మహేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మణ్, మాజీ సర్పంచ్ ఆనంద్ రావు పటేల్, వీడీసీ చైర్మన్ సాయినాథ్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, భూమన రాజు, శ్రీకర్ రెడ్డి, నరేష్, మల్లారెడ్డి, సిందే దత్తు పటేల్, దాసరి సాయన్న, గంగాధర్, పలిసి రాజన్న, వినోద్, అశోక్ రెడ్డి, యోగేష్, హల్దా భోజన్న, వీఓఏలు గౌతమ్, సౌమ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
