Yedapally బాధిత కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక చేయూత
Yedapally బాధిత కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక చేయూత
ఎడపల్లి( Yedapally), ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన బోడ లక్ష్మణ్ అనే యువకుడు మృతి చెందడంతో, ఆయన అంత్యక్రియల కోసం గ్రామస్థులు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించారు.
గ్రామస్థులు సేకరించిన విరాళాలతో అంత్యక్రియల ఖర్చులు పూర్తిచేసిన అనంతరం మిగిలిన రూ.9,300 మొత్తాన్ని గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, దాతలు అందించిన సహకారానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో ఐకమత్యం, మానవత్వానికి నిదర్శనంగా గ్రామస్థులు చూపిన సహకారం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.
