మహిళలు ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం బాటలు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ గుజ్జల సరాలదేవి కల్యాణ మండపంలో వీఎంసీ మెఫ్మా ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని కుట్టు మిషన్ కేంద్రాల్లో శిక్షణ తరగతులు అభ్యసించిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈసందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ మహిళా సాధికారతకు టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెఫ్మా ప్రాజెక్టు కోటేశ్వరి,ఎన్. జి. ఓ రూప,నగవంశం చైర్మన్ ఎరుబోతు రమణారావు, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రాజానా బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
