శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు

శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వైభవంగా అభిషేకం
వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేష ఆరాధన
భక్తులను ఆకట్టుకున్న స్వామివారి అలంకరణ

విజయవాడ, ఆంధ్రప్రభ : తాడిగడపలోని శివాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పుష్పాలతో అభిషేకం నిర్వహించి విశేషంగా ఆరాధించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక దర్శనానికి ఉంచగా, అలంకార శోభతో స్వామివారు భక్తులను ఆకట్టుకున్నారు.

మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది.

Leave a Reply