ఉత్తమ సేవలు అందించడం అభినందనీయం

ఉత్తమ సేవలు అందించడం అభినందనీయం

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ, ఆంధ్ర ప్రభ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం చాలా అభినందనీయమని నల్లగొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ ఉద్యోగులను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని నగరపాల సంస్థ కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నగరపాలక సంస్థ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి లో అందరూ భాగస్వాములు కావాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అశ్రఫ్ హాలీ, కమిషనర్ బి. శరత్ చంద్ర, కార్పొరేటర్లు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply