వరంగల్ ఖుష్ మహల్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వరంగల్ ఖుష్ మహల్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

వరంగల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖుష్ మహల్ ప్రాంగణంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్నదని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో అమరుల పాత్ర చిరస్మరణీయమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, అటవీ సంరక్షణ, మహిళా సంక్షేమం, యువతకు అవకాశాలు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించగలమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply