Arya Vaishya Sangha elections | వైశ్య సంఘం ఎన్నికల హడావుడి..

Arya Vaishya Sangha elections | వైశ్య సంఘం ఎన్నికల హడావుడి..

  • మండలాధ్యక్షుడిగా విజయ్ ఏకగ్రీవం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందడి జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి పట్టణ మండల శాఖ అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల కన్వీనర్ కొమురవెల్లి రాజేందర్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు.

మండల శాఖ అధ్యక్ష పదవికి కాసనగొట్టు విజయ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కన్వీనర్ ప్రకటించారు.

ఇక పట్టణ శాఖ అధ్యక్ష పదవి కోసం మంచాల వరప్రసాద్, ఉజ్జల సదానందం, వెలిశాల రాజశేఖర్, రమేష్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆదివారం రాత్రి ఉజ్జల సదానందంకు మద్దతుగా వెలిశాల రాజశేఖర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పట్టణ శాఖ అధ్యక్ష పదవి కోసం మంచాల వరప్రసాద్, ఉజ్జల సదానందం, రమేష్ బరిలో నిలిచారు. ఈ పదవికి జూన్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు.

Leave a Reply