సుమన్ వ్యాఖ్యలను సమర్థించడం శోచనీయం

సుమన్ వ్యాఖ్యలను సమర్థించడం శోచనీయం
- కాంగ్రెస్ నాయకులు
చెన్నూర్, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సమర్థించడం శోచనీయమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఆదివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సుమన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రజలే గమనిస్తున్నారని అన్నారు.
బాల్క సుమన్ అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకులు పని చేయాల్సి ఉండగా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం తగదన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు. బాల్క సుమన్‌ను రాజకీయంగా సమర్థించకుండా, పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
