LB Nagar Flyover | ట్రాఫిక్ సమస్యలకు చెక్‌

LB Nagar Flyover | ట్రాఫిక్ సమస్యలకు చెక్‌

6-లేన్ల బై-డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్న‌ల్‌

LB Nagar Flyover |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఎల్బీనగర్ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.416 కోట్ల అంచనా వ్యయంతో 6-లేన్ల బై-డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఫ్లైఓవర్ మార్గం ఎల్‌బీ న‌గ‌ర్‌ పరిధిలోని కీలక రహదారులను కలుపుతూ రూపొందించనున్నారు. ప్రణాళిక ప్రకారం టీకేఆర్ కాలేజీ, గాయ‌త్రీ న‌గ‌ర్‌, మంద మ‌ల్ల‌మ్మ జంక్ష‌న్ మీదుగా ఈ ఫ్లైఓవర్ వెళ్లి మీర్‌పేట్‌, బ‌డంగ్‌పేట్‌, అల్మాస్‌గూడ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించనుంది.

ఈ మార్గంలో రోజువారీగా భారీ వాహన రాకపోకలు ఉండటంతో ట్రాఫిక్ జామ్‌లు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ కారణంగా ప్రయాణ సమయం ఎక్కువవుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే ఎల్బీనగర్ నుండి చుట్టుపక్కల ఉపనగర ప్రాంతాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ ప్రవాహం సాఫీగా మారి, రోడ్డు భద్రత కూడా మెరుగుపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.