PABR Dam | నీటి గుంతలో మునిగి తల్లి, కుమార్తె మృతి

PABR Dam | నీటి గుంతలో మునిగి తల్లి, కుమార్తె మృతి

PABR Dam | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల్లో తల్లి, కుమార్తె ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అనంతపురం నగరంలోని అజాద్‌నగర్‌కు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఇవాళ పీఏబీఆర్ డ్యామ్ సమీపానికి విహారయాత్రకు వెళ్లారు. ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామం చివర డ్యామ్ వద్ద అందరూ సరదాగా గడుపుతుండగా, షేక్ ఫరీదా (35), షేక్ యాస్మిన్ (13) ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు.

నీటిలో పడిన ఇద్దరికీ ఈత రాకపోవడంతో బయటకు రాలేక ఊపిరాడక మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ఫరీదా తల్లి షేక్ కుర్సీద్ భాను ఫిర్యాదు మేరకు ఉరవకొండ ఎస్సై జనార్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Leave a Reply