అమ్మ మాటతో బడి బాట..

అమ్మ మాటతో బడి బాట..

చిన్నారుల నమోదు ప్రారంభం

మునుగోడు ఆంధ్రప్రభ: మూడేళ్ల వయస్సు నిండిన ప్రతి చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అంగన్‌వాడీ సిబ్బంది తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల నమోదు చేపట్టారు.

ఈ సందర్భంగా అర్హులైన మూడేళ్ల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి వారికి యూనిఫాంలను పంపిణీ చేశారు.

చిన్నారుల సమగ్ర వికాసానికి అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో దోహదపడతాయని, ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్య సేవలు కూడా అందుతాయని తల్లిదండ్రులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు విక్టోరియా, ధనమ్మ, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply