National Highway | ఐదుగురికి గాయాలు…

National Highway | ఐదుగురికి గాయాలు…
National Highway |ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండేపల్లి సమీపంలోని 216వ జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
స్థానికుల కథనం ప్రకారం.. తుని నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం తీవ్రతకు కారు దెబ్బతింది.
కారులో మొత్తం ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి సమీప ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
