Team India | వైభవ్ కి టీమిండియా పిలుపు..
Team India | వైభవ్ కి టీమిండియా పిలుపు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: భారత టీ20 క్రికెట్ జట్టులో భారీ మార్పులకు బీసీసీఐ (BCCI) సెలెక్షన్ కమిటీ తెరలేపినట్లు తెలుస్తోంది. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా నియమించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం శనివారం ప్రకటించనున్న భారత టీ20 జట్టులోనే ఈ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమి కారణంగా ఈసారి అసలు జట్టులోనే చోటు దక్కకపోవచ్చనే వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టడానికి ఆయన ఇటీవలి పేలవ బ్యాటింగ్ రికార్డే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఆయన కేవలం 242 పరుగులు మాత్రమే చేయగా… ఇటీవల ముగిసిన 2026 ఐపీఎల్ సీజన్లలోనూ 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులకే పరిమితం అయ్యాడు.
దీంతో సెలెక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ గత కొన్నేళ్లుగా అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా అద్భుతమైన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కొలకత్తా నైట్ రైడర్స్‌ను 2024లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన అయ్యర్, అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను (2020), ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను (2025) ఫైనల్స్‌కు చేర్చి తన వ్యూహాత్మక చతురతను చాటుకున్నారు. దీనికి తోడు 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో భారీగా పరుగులు సాధించి సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు.
