accident | ముగ్గురు మృతి..

accident | ముగ్గురు మృతి..

accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో బైక్‌, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసుల వివరాల ప్రకారం.. పాండవగల్లు గ్రామం నుంచి గనేకల్ వైపు బైక్‌పై వెళ్తున్న వీరేశ్‌ (19), మహేంద్ర (17)లను ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

అదే ఆటోలో ప్రయాణిస్తున్న విశ్వనాథ్‌ (70) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Leave a Reply