డ్యాన్స్ అదరగొట్టిన బాలయ్య కుమార్తె

డ్యాన్స్ అదరగొట్టిన బాలయ్య కుమార్తె
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో బాలయ్య చిన్న కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో సందడి చేస్తోంది. ఉత్సాహంగా స్టెప్పులు వేసిన ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్‌కు మంచి స్పందన వస్తోంది. సింపుల్‌గా, ఎనర్జీగా స్టెప్పులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు బాలయ్య ఎనర్జీ కూతురిలోనూ కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రచారాలకు దూరంగా ఉండే తేజస్విని బాలయ్య సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాంగ్ కు తగ్గుట్టగా.. మంచి స్పీడుతో.. గ్రేస్ తో తేజస్విని డ్యాన్స్ చేయడం విశేషం.

