గిన్నీస్ రికార్డులో మానుకోట యువకుడు

గిన్నీస్ రికార్డులో మానుకోట యువకుడు

-కీబోర్డ్ సంగీత పోటీలో ప్రవీణ్ ప్రతిభ
-ప్రపంచ వేదికపై జిల్లా యువకుడి ఘనత

మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా యువకుడు వయంతుల ప్రవీణ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. జిల్లా కేంద్రంలోని రామన్నపేట కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమారుడైన ఆయన శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టోరియా ఆడిటోరియంలో జరిగిన మ్యూజిక్ కీబోర్డ్ పోటీలలో పాల్గొన్నాడు. 22 దేశాలకు చెందిన రెండు వేల మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారిలో 777 మంది గిన్నీస్ రికార్డు సాధకులుగా గుర్తింపు పొందారు. ఆ జాబితాలో ప్రవీణ్ చోటు దక్కించుకోవడం జిల్లాకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. సంగీతం పై ఆయనకున్న అభిరుచి, నిరంతర సాధన ఈ విజయానికి కారణమయ్యాయి. ప్రపంచ స్థాయి వేదిక పై తన ప్రతిభను ప్రదర్శించడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘనత పట్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖులు ప్రవీణ్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply