నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

  • ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణ మండపంలో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. నిరుద్యోగ సమస్యలు తగ్గించేందుకు తమ ట్రస్ట్ తరఫున భవిష్యత్తులో కూడా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు.

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని,ఉదయం నుంచే యువత కళ్యాణ మండపానికి భారీగా చేరుకొని తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగిందన్నారు.జాబ్ మేళా ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు సహాయం అందించారు.యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఏఎంసీ చైర్మన్ లావుడియా మంజుల భాస్కర్,పాలకుర్తి,తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్యా నాయక్,రాపాక సత్యనారాయణ, పాలకుర్తి మండల అధ్యక్షుడు కుమారస్వామి,తొర్రూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు,జక్కా మహబూబ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్లు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply