natural-beauty-tabitha-mary-viral-look I 2905 I అందానికి వర్ణం అడ్డుకాదు…నేచురల్ బ్యూటీ టబితా మేరి

సహజ అందంతో మెరిసిన టబితా మేరి
నెటిజన్లను ఆకట్టుకున్న లుక్
సినిమాల్లోకి రావాలంటున్న అభిమానులు
natural-beauty-tabitha-mary-viral-look I 2905 ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయం : సహజ అందానికి ఎవరైనా ఫిదా అవుతారు. కలర్ కూడా ఆకర్షణకు అడ్డురాదు. ఇదే నిరూపించింది టబితా మేరి! ఆమె లుక్‌ను ఆకట్టుకున్న నెటిజన్లు.. ముఖ్యంగా యువకులు సినిమాల్లోకి రావాలని అంటున్నారు. ఏదీఏమైనా కేన్స్ నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026లో మెరిసిన తమిళ మోడల్ టబితా మేరీపై అందరి దృష్టి పడటం.. నెటిజన్లు టోల్ చేయడం గమనించదగిన విషయం. కలరిజం (చర్మవర్ణ వివక్ష)కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం వంటి అంశాలతో ముందుకు వెళుతున్న ఆమెకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతున్నదనడంలో సందేహం లేదు. టబితా మేరీ ప్రస్తుతం యువతకు ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతున్నారు.

natural-beauty-tabitha-mary-viral-look I 2905 I లిక్విడ్-సిల్వర్ గౌన్ లో ప్రత్యేక ఆకర్షణ
ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నిర్వహించిన 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026లో మెరిసిన తమిళ మోడాల్ టబితా మేరీపై అందరి దృష్టి పడింది. ఆమెను వెంటనే సినిమాలోకి తీసుకోండి అంటూ నెటిజన్లు సలహాలు కూడా ఇచ్చారు. కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఆమె చేసిన తొలి ప్రవేశం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఫ్యాషన్ ఎలిగెన్స్‌తో పాటు సహజ అందాన్ని మేళవించిన ఆమె లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. టబితా మేరి ధరించిన లిక్విడ్-సిల్వర్ గౌన్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ ప్రత్యేక డ్రెస్‌ను బ్రిటిష్-బంగ్లాదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ఖానుమ్స్ రూపొందించింది. సంప్రదాయ శైలిని ఆధునిక ఫ్యాషన్‌తో కలిపే డిజైన్లకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి కూడా. కేన్స్ వంటి అంతర్జాతీయ వేదికపై దక్షిణాసియా మూలాలున్న బ్రాండ్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా టబితా తన సంస్కృతిపట్ల గౌరవాన్ని చాటుకున్నారు. ఆమె ధరించిన గౌన్‌లో గ్రీకియన్ స్టైల్‌ను గుర్తు చేసే వన్-షోల్డర్ నెక్లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాడీస్‌పై ఉన్న మెరిసే మడతల డిజైన్ ఆమె రూపాన్ని మరింత హైలైట్ చేసింది. ముత్యాలతో అలంకరించిన నడుము భాగం నుంచి నేల వరకు ప్రవహించేలా ఉన్న స్కర్ట్ ఆమె నడకలో ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది.

natural-beauty-tabitha-mary-viral-look I 2905 I నేచురల్ బ్యూటీతో …
టబితా లుక్‌లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది ఆమె సహజ అందమే. ముదురు మెరిసే చర్మవర్ణం, పొడవైన నల్లటి జుట్టుతో ఆమె నిజమైన సినీ కథానాయికలా కనిపించారు. ఆమె మేకప్‌ను చాలా సహజంగా ఉంచడం ప్రత్యేకంగా నిలిచింది. ముఖంలోని సహజ లక్షణాలను దాచకుండా మరింత హైలైట్ చేయడం ద్వారా ఆమె ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. గతంలో చర్మవర్ణ వివక్ష (Colourism) గురించి బహిరంగంగా మాట్లాడిన టబితా, ఇప్పుడు తన లుక్ ద్వారా అందానికి కొత్త నిర్వచనం ఇచ్చారని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

natural-beauty-tabitha-mary-viral-look I 2905 I సినిమాల్లోకి రావాలి అంటున్న అభిమానులు
టబితా కేన్స్ ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఆమెను వెంటనే సినిమాలో తీసుకోవాలి”, “నిజమైన గ్లోబల్ స్టార్లా కనిపిస్తోంది”, “ఇదే సహజ అందం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టబితా మేరి తమిళ మూలాలున్న మోడల్. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. కంటెంట్ క్రియేటర్‌గా ప్రసిద్ధి చెందిన యువతి. ఆమె ఇటీవల 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2026 రెడ్ కార్పెట్‌పై చేసిన తొలి ప్రవేశంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

natural-beauty-tabitha-mary-viral-look I 2905 I టబితా మేరీ నేపథ్యం
టబితా మేరీ తమిళ కుటుంబానికి చెందినవారు. ఆమె జర్మనీలో పెరిగారు. విదేశాల్లో పెరిగినా, తన తమిళ సంస్కృతి , దక్షిణాసియా మూలాలను గర్వంగా ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. టబితా సోషల్ మీడియాలో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ కంటెంట్ ద్వారా ప్రజాదరణ పొందారు. సహజ అందాన్ని ప్రోత్సహించడం ముదురు చర్మవర్ణంపై గర్వంగా మాట్లాడడం. కలరిజం (చర్మవర్ణ వివక్ష)కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం వంటి అంశాలతో యువతలో మంచి ఆదరణ పొందారు.
