10times | నిందితుల అరెస్టు…

10times | నిందితుల అరెస్టు…
రూ.25 లక్షల సుపారీతో హత్యకు కుట్ర
10times | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది మొహిజుద్దీన్ హత్యకేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఆలంఖాన్తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మొహిజుద్దీన్ను హత్య చేయించేందుకు ఆలంఖాన్ రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని నిందితులు పథకం ప్రకారం దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మొహిజుద్దీన్ను హతమార్చేందుకు గత రెండేళ్ల కాలంలో దాదాపు 10సార్లు ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు హైదరాబాద్లో కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి కీలక వివరాలు రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు.
