బూత్ స్థాయిలో భాజపా బలోపేతానికి కృషి చేయాలి

బూత్ స్థాయిలో భాజపా బలోపేతానికి కృషి చేయాలి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని భాజపా మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ అన్నారు.
గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డోర్నకల్ మాజీ కన్వీనర్ బల్గురు వెంకటరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చిలువేరు కరుణాకర్, మండల ప్రధాన కార్యదర్శి ఏరనాగి కుమారస్వామి, మండల ఉపాధ్యక్షులు నెలకుర్తి సత్యనారాయణ రెడ్డి, దాసరి వీరన్న, దొనికేన శ్రీనివాస్, కాలు నాయక్, మండల బీజేవైఎం అధ్యక్షుడు పొడుపుగంట అంజి తదితరులు పాల్గొన్నారు.
