- మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రజలు
- రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీలోకి ప్రవాహంలా చేరికలు
- యువ నాయకుడు సాయి ప్రసాద్ యాదవ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. యువనాయకులు సాయిప్రసాద్ యాదవ్ వివిధ గ్రామాల నుండి 200 మంది బి.జె.పి,కాంగ్రెస్ పార్టీల నుండి తన అనుచరులతో భారీ ర్యాలీతో బిఅర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం చేరుకొని నిరంజన్ రెడ్డికి శాలువా, బొకే ఇచ్చి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడ్డదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను హరిగోస పెడుతున్నారని ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. సాయిప్రసాద్ తోపాటు చేరిన నాయకులు, కార్యకర్తలను పార్టీ ఆదరిస్తుందని కష్టపడి పనిచేసేవారికి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కే.మాణిక్యం,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,కురుమూర్తి యాదవ్,సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి,మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు,నాయకులు మాధవ్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,డేగ.మహేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ పూర్ నరసింహ,సుదర్శన్ రెడ్డి,చిట్యాల.రాము, ఇమ్రాన్,మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,కుమార్ యాదవ్,మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్,సయ్యద్.జెమీల్,మునికుమార్,సేనాపతి,పి.సురేష్,నాగేంద్రం,సత్యం, హర్షవర్ధన్ రెడ్డి, వెంకటేష్, వెంకటేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.