కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ

కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ
చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బోడ జనార్దన్ గురువారం తన అనుచరులతో కలిసి నూతన పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్)లో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోడ జనార్దన్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోడ జనార్దన్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు సార్లు చెన్నూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
